Header Banner

రాబోయే రోజులు రాత్రుల్లా ఉండవు.. ఊపిరి బిగించే ఎండల తాకిడీ! ఆ మండలాల్లో ఎండలు అత్యధికం!

  Tue Apr 15, 2025 09:42        Others

ఏపీలో ఎండ తీవ్రత అధికమౌతోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి. శనివారం బాపట్ల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని రావిపాడులో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. నంద్యాల, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇదే స్థాయిలో పగటి ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 119 ప్రాంతాల్లో ఎండ తీవ్రత 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. నేడు కూడా అదే తీవ్రత కొనసాగుతుందని ఎస్డీఎంఏ అంచనా వేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రత రికార్డవుతుందని పేర్కొంది. మే నాటికి ఎండ తీవ్రత 45 డిగ్రీల వరకు వెళ్ల అవకాశాలు ఉన్నాయి. వేడిగాలులు సైతం వీస్తోండటం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వేర్వేరు జిల్లాల్లో 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 68 మండలాల్లో వడగాలులు వీచినట్లు విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వడగాలుల తీవ్రత నేడు కూడా కొనసాగుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 67 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొన్నారు. నేడు వడగాలుల తీవ్రత అత్యధికంగా ఉండే జిల్లాల్లో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. విజయనగరం- 11, పార్వతీపురం మన్యం- 10, శ్రీకాకుళం- 7 మండలాల్లో వీటి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని రోణంకి కూర్మనాథ్ విజ్ఞప్తి చేశారు.


ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #HeatwaveAlert #AndhraPradeshHeat #APWeather #ScorchingSun #StayHydrated #SummerStrike